1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Brazil registers 44,235 new COVID cases, 984 deaths

బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 44, 235 కేసులు.. 984 మంది మృతి

Brazil
Covid
బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో 44,235 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 984 మంది మృతి చెందారని అధికారులు చెప్పారు. 
 
దీంతో బ్రెజిల్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 37.61లక్షలకు చేరిందని తెలిపారు. అంతేకాకుండా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 1.18లక్షలు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో 29.47లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. బ్రెజిల్‌లో మొదటి కరోనా కేసు.. సావో పాలో రాష్ట్రంలో ఫిబ్రవరి 26న నమోదైంది. అత్యధిక కరోనా మరణాలు ఈ రాష్ట్రంలోనే సంభవించినట్లు అధికారులు తెలిపారు. సావో పాలో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 29,415మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు తెలిపారు.
 
మరోవైపు ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 24,687,652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 836,893 మంది కరోనాతో చనిపోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చైనా కరోనాను పుట్టించేందుకు ముందే వ్యాక్సిన్ కనిపెట్టిందా? విస్తుపోయే నిజాలు