శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (12:57 IST)

బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 51వేలకు పైగా కొత్త కేసులు

కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో 51 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 1,211 మంది కరోనా సోకి మృతి చెందారు.

లాటిన్ అమెరికాలో ఇప్పటివరకు 23 లక్షల 94 వేల 513 కేసులు నమోదవగా.. 86,వేల 449 మంది మృతిచెందారు. 16 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కాగా శనివారం బ్రెజిల్‌లో కొత్తగా 55,891 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
 
కరోనా వైరస్ కారణంగా బ్రెజిల్‌లో వారంలో ఎనిమిది వేలకు పైగా బాధితులు మృతి చెందారు. దక్షిణాఫ్రికాలోనూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. 6300 మందికి పైగా మరణించారు. మెక్సికోలో మూడు లక్షల 85 వేల కరోనా కేసులు నమోదవగా.. 43 వేలకు పైగా బాధితులు మృతిచెందారు.
 
ఇదిలావుండగా.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా తరువాత కరోనా వల్ల దక్షిణ ఆఫ్రికా ఎక్కువగా ప్రభావితమైంది. ఇప్పటివరకు ఇక్కడ నాలుగు లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. 6300 మందికి పైగా మరణించారు. మెక్సికోలో మూడు లక్షల 85 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 43 వేలకు పైగా బాధితులు మృతిచెందారు.