అమాయకుల అంధ విశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అందినంత దోచుకొంటున్నాడు నకిలీ బాబా. అతీతమైన శక్తులతో కరోన రోగులకు నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు ఓ కరోన బాబా. అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నాడు. మాయలు, మంత్రాలతో కరోనా రోగులకు చికిత్స చేస్తే నయమవుతుందని శిష్యులతో ప్రచారం చేసుకుంటాడు. బురిడీ కరోనా బాబా మాటలు నమ్మి వచ్చిన రోగులకు మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి వేలాది రూపాయలు...