బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (09:36 IST)

జిగేల్ మంటున్న బంగారం ... ధరల్లో మళ్లీ పెరుగుదల

బంగారం ధరలు జిగేల్ మంటున్నాయి. ఈ ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ఈ ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.
 
దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.450 వరకు పెరగగా.. వెండి ఏకంగా రూ.1100 వరకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,430 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,470గా ఉంది. అలాగే, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,190గా ఉంది.
 
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది.