ప్రతి రోజూ షాకిస్తున్న పెట్రోల్ - డీజల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు ప్రతి రోజూ షాకిస్తున్నాయి. ఈ పెరుగుతున్న ధరలు ప్రజలకు గుదిబండగా మారాయి. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారిపోయాయి.
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి దాదాపు లీటరు ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ ధర రూ.89.18 ఉండగా మిగిలిన ముఖ్యమైన సిటీలలో రేట్లు ఇలా ఉన్నాయి.
తాజాగా రేట్ల ప్రకారం... ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104.90, డీజిల్ రూ.96.72గా ఉండగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.99.80, డీజిల్ రూ.93.72గా వుంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.94.54, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.105.21, డీజిల్ రూ.99.08గాను, విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.103.76, డీజిల్ రూ.97.70గా వుంది.