1. వార్తలు
  2. కెరీర్
  3. విదేశీ
  4. Auxilo Finserve Launches Overseas Scholarship Programme

విదేశీ విద్య కోసం స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఆక్సిలో ఫిన్‌సర్వ్

Students
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఆక్సిలో ఫిన్‌సర్వ్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ తమ విద్యా సంబంధిత సీఎస్ఆర్ కేటాయింపులను రెట్టింపు చేస్తూ సుమారు రూ.2.6 కోట్లకు చేర్చింది. గుర్తింపు పొందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో స్టెమ్, ఎంబీఏ కోర్సుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం ఇంపాక్ట్‌ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం దేశీయ ఇంపాక్ట్‌ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను కూడా కొనసాగించనుంది.
 
ఇంపాక్ట్‌ఎక్స్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్
విదేశాల్లో విద్యనభ్యసించే సామర్థ్యం, ఆ ఆకాంక్ష ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న గణనీయమైన ఆర్థిక అవరోధాన్ని తగ్గించడమే ఆక్సిలో ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కార్యక్రమ లక్ష్యం.
 
ఇంపాక్ట్‌ఎక్స్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ముఖ్య వివరాలు:
ఆర్థిక సహాయం: గరిష్ఠంగా రూ.3 లక్షలు
అర్హత: పూర్తిస్థాయి, క్యాంపస్‌లో నిర్వహించే పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు
విభాగాలు: స్టెమ్ , ఎంబీఏ
వయసు: 18 నుంచి 35 సంవత్సరాలు
విద్యార్హత: కనీసం 70 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన సీజీపీఏ
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం: అర్హత కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు
వార్షిక కుటుంబ ఆదాయం రూ.7 లక్షల లోపు ఉన్న విద్యార్థులు ఇంపాక్ట్‌ఎక్స్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.7 లక్షలకు పైగా ఉన్న విద్యార్థుల దరఖాస్తులను మొత్తం స్కాలర్‌షిప్ అర్హత ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తారు.
 
‘‘తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల నుండి వచ్చినప్పటికీ మంచి ప్రతిభ కనబరిచే విద్యార్థులకు, పెరుగుతున్న విద్యా వ్యయం తరచుగా ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ చదువును నిరాటంకంగా కొనసాగించే అవకాశాన్ని కల్పించడమే ఇంపాక్ట్‌ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా మా ప్రయత్నం’’ అని ఆక్సిలో ఫిన్‌సర్వ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ సక్సేనా తెలిపారు.
 
స్కాలర్‌షిప్‌లు నిజంగా అర్హులైన అభ్యర్థులకు అందేలా ఆక్సిలో పటిష్ఠమైన ధ్రువీకరణ ప్రక్రియను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల ఇళ్లను సందర్శించడం కూడా ఉంటుంది. విద్యార్థులు సమర్పించిన సమాచారాన్ని ధ్రువీకరించడమే కాకుండా, దానిని విశ్లేషించి నిర్ధారించేలా ఆక్సిలో బృందం పరిశ్రమలోనే తొలిసారిగా అంతర్గత ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఇది సోషల్ ఇంపాక్ట్ స్కోర్‌ను రూపొందించడం ద్వారా విద్యార్థుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా చూస్తుంది.
 
విద్యార్థులు auxilo.com/impactx-global వెబ్‌సైట్‌ను సందర్శించి, అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఇంపాక్ట్‌ఎక్స్ డొమెస్టిక్ స్కాలర్‌షిప్
గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1.05 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేసి, భారతదేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 141 మంది విద్యార్థులకు సహాయం అందించింది.
 
ఇంపాక్ట్‌ఎక్స్ డొమెస్టిక్ స్కాలర్‌షిప్ ముఖ్య వివరాలు:
ఆర్థిక సహాయం: ప్రతి సెమిస్టర్‌కు గరిష్ఠంగా రూ.1 లక్ష
అర్హత: పూర్తిస్థాయి అండర్‌గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్‌గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులు
గుర్తింపు పొందిన విద్యాసంస్థలు: ఏఐసీటీఈ, యూజీసీ, నాక్ లేదా ఎన్‌బీఏ ఆమోదం పొందిన సంస్థలు
విద్యార్హత: కనీసం 70 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన సీజీపీఏ
వయసు: 18 నుంచి 35 సంవత్సరాలు
వార్షిక కుటుంబ ఆదాయం: రూ.7 లక్షల వరకు (వార్షిక కుటుంబ ఆదాయం రూ.7 లక్షలకు పైగా ఉన్న విద్యార్థుల దరఖాస్తులను మొత్తం స్కాలర్‌షిప్ అర్హత ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తారు)
ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, కంప్యూటర్ అప్లికేషన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ తదితర విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ఇంపాక్ట్‌ఎక్స్ డొమెస్టిక్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా మద్దతు లభించింది.
 
‘‘భారతదేశంలో యూజీ, పీజీ కోర్సులను అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంపాక్ట్‌ఎక్స్ డొమెస్టిక్ స్కాలర్‌షిప్ ద్వారా సహాయం అందించడం కొనసాగిస్తాం. మా కార్యక్రమాల భౌగోళిక పరిధిని విస్తరించడంతో పాటు, మరింత మంది విద్యార్థులకు చేరువై ఎక్కువ ప్రభావాన్ని చూపాలని ఆశిస్తున్నాం’’ అని సక్సేనా తెలిపారు.
 
స్కాలర్‌షిప్‌లు నిజంగా అర్హులైన అభ్యర్థులకు అందేలా సంస్థ పటిష్ఠమైన ధ్రువీకరణ ప్రక్రియను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల ఇళ్లను సందర్శించడం కూడా ఉంటుంది. విద్యార్థులు సమర్పించిన సమాచారాన్ని ధ్రువీకరించడం, విశ్లేషించడం, నిర్ధారించడం ద్వారా సోషల్ ఇంపాక్ట్ స్కోర్‌ను రూపొందించే అంతర్గత ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఆక్సిలో అభివృద్ధి చేసింది. విద్యార్థుల ఎంపికలో పక్షపాతం లేకుండా చేసేందుకు ఈ స్కోర్‌ను ఉపయోగిస్తున్నారు.
 
విద్యార్థులు auxilo.com/Impactx-scholarship/ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా  అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
ముంబై పబ్లిక్ పార్కులో యువ జంటపై దాడి.. కర్రలతో కొట్టడం, ఆపై పిడికిళ్లతో?