సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లోని 2,800 మందికిపైగా విద్యార్థులకు మలబార్ గోల్డ్- డైమండ్స్ స్కాలర్‌షిప్
- రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
- Nagarjuna: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన నాగార్జున
- ప్రతిభావంతులైన బాలికలకు కోటక్ కన్య స్కాలర్‌షిప్ కు ఆహ్వానం
- కోటక్ కన్య స్కాలర్‌షిప్
చారిత్రాత్మక వార్షిక స్కాలర్‌షిప్ హామీని ప్రకటించిన యుడబ్ల్యుఏ ఇండియా
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (యుడబ్ల్యుఏ), ఒక చారిత్రాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని యుడబ్ల్యుఏ ఇండియా ద్వారా ప్రకటించింది. ఇది భారతీయ మార్కెట్‌లోని అత్యంత ముఖ్యమైన స్వతంత్ర హామీలలో ఒకటి. విభిన్న విద్యా, సామాజిక-ఆర్థిక , ప్రాంతీయ నేపథ్యాలకు చెందిన, అధిక సామర్థ్యం గల విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే యుడబ్ల్యుఏ యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అమిత్ చక్మా మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక స్కాలర్‌షిప్ నిబద్దత, భారతదేశం పట్ల యుడబ్ల్యుఏ కు వున్న ప్రగాఢమైన, శాశ్వతమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మేము ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యుడబ్ల్యుఏ విద్యను పొందే అవకాశాలను మరింతగా విస్తరిస్తున్నాము. తద్వారా, ఆర్థిక పరిమితులు ఎవరి ఆశయాలనూ అడ్డుకోకుండా చూస్తున్నాము. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించి, ప్రపంచ స్థాయి కెరీర్‌లకు సిద్ధమయ్యేలా తోడ్పాటునందించడమే మా లక్ష్యం” అని అన్నారు.
యుడబ్ల్యుఏ ఇండియా కోసం దరఖాస్తులు ఇప్పుడు స్వీకరిస్తున్నారు. ముంబై మరియు చెన్నైలలో క్యాంపస్‌లతో యూడబ్ల్యూఏ ఇండియా ప్రపంచ పారిశ్రామిక డిమాండ్స్ , భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా, స్టెమ్, బిజినెస్, టెక్నాలజీ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్: www.uwa.edu.au/india ద్వారా ప్రోగ్రామ్‌లను అన్వేషించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధానంగా ట్యూషన్ ఫీజు తగ్గింపుల ద్వారా అందించబడే ఈ బహుళ విధాన స్కాలర్‌షిప్ కార్యాచరణ, భారతీయ నియంత్రణ అవసరాలు, యూడబ్ల్యూఏ యొక్క ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే, విద్యా ప్రతిభ, ఆర్థిక అవసరం, నాయకత్వ సామర్థ్యం, ప్రాంతీయ సమ్మిళితత్వాన్ని గుర్తిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో మెరిట్ స్కాలర్‌షిప్‌లు, గ్లోబల్ ఎక్సలెన్స్ స్కాలర్‌షిప్‌లు, ఈక్విటీ మరియు సీఎస్ఆర్-మద్దతు గల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ సహ-నిధుల అవకాశాలు (ప్రారంభంలో మహారాష్ట్ర మరియు తమిళనాడులో), మరియు పూర్వ విద్యార్థుల మద్దతు గల స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి.
విద్యాపరమైన కఠినత్వంతో పాటు విద్యార్థుల సంఖ్యను కూడా సమతుల్యం చేసేలా రూపొందించబడిన ఈ కార్యక్రమం, అర్హులైన విద్యార్థులకు పలు రకాల మద్దతును మిళితం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇది మెరుగైన విద్యా ఫలితాలను కొనసాగిస్తూనే ఆర్థిక అడ్డంకులను గణనీయంగా తగ్గిస్తుంది. అన్ని స్కాలర్‌షిప్‌లూ యూడబ్ల్యూఏ యొక్క స్థిరమైన విధానాల ప్రకారం నిర్వహించబడతాయి. ప్రతి అడ్మిషన్ల ప్రక్రియకు ముందు పారదర్శక అర్హత ప్రమాణాలు ప్రచురించబడతాయి.
యుడబ్ల్యుఏ ఇండియా అడ్మిషన్లతో పాటుగా ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం కూడా ప్రారంభించబడుతుంది, మొదటి బ్యాచ్ ప్రవేశాల ఆఫర్లలోనే స్కాలర్‌షిప్‌లు పొందుపరచబడతాయి. డిమాండ్, ఫలితాలు మరియు విస్తరణ అవకాశాలను అంచనా వేయడానికి, మొదటి సంవత్సరం తర్వాత ఈ ఫ్రేమ్‌వర్క్‌ను అధికారికంగా సమీక్షిస్తారు. తమ ఇండియా వ్యూహంలో స్కాలర్‌షిప్‌లను ప్రధానాంశంగా ఉంచడం ద్వారా, యుడబ్ల్యుఏ అందరికీ అందుబాటులో ఉంటూనే, అకడమిక్ శ్రేష్ఠత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. అదే సమయంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య దీర్ఘకాలిక విద్యా , నైపుణ్య భాగస్వామ్యాలను కూడా బలోపేతం చేస్తోంది.
