సంబంధిత వార్తలు
- ఏపీలో పల్లె పోరు : మూడో దశలో 579 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
- భారత సైనికులకు గుడ్ న్యూస్.. పది లక్షల మందికి శాటిలైట్ ఫోన్లు
- రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు... 2,786 సర్పంచ్ పోస్టులు, 20,817 వార్డులకు పోలింగ్
- భారతీయ ఐటీ నిపుణులకు బైడెన్ గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?
- ఈసీఐఎల్ నుంచి 650 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. AP_Skillలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అనంతపురం జిల్లాకు చెందిన అసాహీ ఇండియా గ్లాస్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీని ప్రకటనలో పేర్కొనలేదు.
ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ విభాగంలో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 2018, 19, 20 సంవత్సరాల్లో పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని Gudipalli/Somendapalliలోని కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.
