శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:15 IST)

భారతీయ ఐటీ నిపుణులకు బైడెన్ గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. డొనాల్ట్ ట్రంప్ విధానాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నారైలకు సుముఖంగా వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా వుంటూ.. తన పని తాను చేసుకుపోతున్న జో బైడెన్.. తాజాగా భారతీయ ఐటీ నిపుణులకు మరో తీపి కబురు అందించారు. మరింత మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్ విధానానికి సమూల మార్పులు చేయ సంకల్పించారు. 
 
అమెరికాలో అన్ డాక్యుమెంటెడ్ జాబితాలో ఉన్న వలస కార్మికులు 1.1 కోట్ల మందికి శరవేగంగా పౌరసత్వం కల్పించేందుకు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు బైడెన్‌. అయితే ఈ ప్రతిపాదనకు బైడెన్‌కు రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే విద్యార్థులకు అనుమతులు ఇవ్వాలని, ఉపాధి హామీ ఆధారిత గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచాలని మరో నిబంధనను ప్రతిపాదించారు.
 
బైడెన్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనల వల్ల అమెరికాలోకి మరింత మంది విదేశీ నిపుణులు రావడానికి వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల అమెరికా కంపెనీల్లో అధిక నిపుణులైన కార్మికులకు హెచ్‌-1బీ వీసాలపై పరిమితులు ఉండవని బిజినెస్ గ్రూపులు భావిస్తున్నాయి. దీని ప్రకారం భవిష్యత్‌లో అత్యధిక నిపుణులకు ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నాయి.