1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Mulayam Singh Yadav's Younger Son Prateek Yadav Dies

Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు మృతి

Mulayam Singh Yadav
Prateek Yadav
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, అఖిలేష్ యాదవ్ సవతి సోదరుడు అయిన ప్రతీక్ యాదవ్ బుధవారం మరణించారని వర్గాలు తెలిపాయి. 38 ఏళ్ల ప్రతీక్ యాదవ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో తెల్లవారుజామున సివిల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారని ఆ వర్గాలు తెలిపాయి. 
 
ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి ఉన్న యాదవ్, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన భార్య అపర్ణా బిష్ట్ యాదవ్ బీజేపీలో చేరి, ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్.. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ప్రతీక్, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అంతలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
About Writer
సెల్వి