Maha Shakti Review : దేవతగా నయనతార నటించిన మహాశక్తి చిత్రం రివ్యూ
Nayanatara as Mahasakthi
సాంకేతికత: ఛాయాగ్రహణం: గోపి అమర్‌నాథ్, సంగీతం: హిప్‌హాప్ తమిళ, నిర్మాత: ఇషారి కె. గణేష్, దర్శకత్వం: సుందర్ సి.
ఎడిటింగ్: ఫెన్నీ ఆలివర్.
గతంలో నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆధ్యాత్మిక కొనసాగింపుగా మూకుత్తి అమ్మన్ 2. తెలుగులో మహాశక్తి గా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మొదటి భాగానికి ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగానికి సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
శక్తి (నయనతార) పోలీస్ కానిస్టేబుల్. తల్లి బాలమ్మ (ఊర్వశి). శక్తికి తరచుగా నిద్రలో వింత కలలు వస్తుంటాయి; అందులో కొందరు వ్యక్తులు ఆమెను మైలాంచి అనే ప్రాంతానికి రమ్మని పదేపదే కోరుతుంటారు. ఈ క్రమంలో చిన్నపిల్లను రక్షించే క్రమంలో ఓ దుండగుడుని చంపేస్తుంది. ఈ సందర్బంగా ఆమెకు ప్రమోషన్ ఇవ్వాలని అధికారులు ఫిక్స్ అవుతారు. కానీ అనుకోకుండా తన కలలో వినిపించిన మైలాంచికి కానిస్టేబుల్ గా బదిలీకి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. అక్కడకు వెళ్ళగానే రకరకాల విషయాలు తెలుస్తాయి. అందులో 2వేల ఏళ్ళ నాటి జన్మకి సంబంధించిన భైరి (రెజీనా కసాండ్ర) అనే దుష్టశక్తి ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి సామాన్యురాలిగా వున్న శక్తి ఏమి చేసింది. ఆమెకు ఎవరైనా సాయం చేశారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సమీక్ష:
ఈ సినిమా చూస్తే, శక్తి పాత్ర, భైరి పాత్ర, భైరి ప్రేమికుడు పాత్ర లోతుగా గ్రహిస్తే, లలితా సహస్రనామాల్లోని భండాసురిడి పాత్ర స్పురిస్తుంది. అయితే ఆ స్థాయిలో యాక్షన్ లేకపోయినా అలా వుండేలా విజువల్స్ తో దర్శకుడు చూపించగలిగాడు. ఇందులో స్నేహ, ఖుబ్బూ లు కూడా ఇద్దరు దేవతులుగా నటించారు.
'మూకుత్తి అమ్మన్ 2' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించామని చిత్ర బృందం చెప్పినా తెరపై కనిపించే దృశ్యాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దైవ, క్షుద్ర శక్తుల మధ్య సాగే సన్నివేశాలు వీఎఫ్ఎక్స్ (VFX) సాదారణంగా వున్నాయి, సినిమా అంతటా నాణ్యత లేని సీజీఐ (CGI) ఉండటం వల్ల, ప్రేక్షకులు ఆ లోపాలను పక్కన పెట్టి కథపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది.
అంతేకాకుండా, ఇందులో ఏఐ (AI) సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించారు; ముఖ్యంగా అడవికి సంబంధించిన సన్నివేశాలు కృత్రిమంగా కనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్‌ను పక్కన పెట్టినా కూడా, కథనం చాలా వరకు బోరింగ్‌గా, నిస్తేజంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఎంపికలు చాలా పాతవిగా ఉన్నాయి.
యోగి బాబు సన్నివేశాలు కాస్త ఎంటర్ టైన్ చేయిస్తాయి. ఓల్డ్ ఫార్మెట్ లో వుండడంతో ఓ దశలో ఇబ్బందికూడా వుంటుంది. నేపథ్య సంగీతం అనవసరంగా చాలా బిగ్గరగా ఉంది. దునియా విజయ్, సునీల్, రామచంద్ర రాజు తమ పాత్రలలో వృధా అయ్యారు.
హిప్‌హాప్ తమిజా పాటలు, నేపథ్య సంగీతం బలహీనంగా ఉన్నాయి, మరియు గోపీ అమర్‌నాథ్ సినిమాటోగ్రఫీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. రెండున్నర గంటల కంటే తక్కువ నిడివి ఉన్నప్పటికీ, సినిమా అనవసరంగా నిడివి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఎడిటింగ్ విషయంలో ఇంకా చాలా మెరుగుపరచాల్సి ఉంది.
వెంకట్ రాఘవన్ రాసిన స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేదు, మరియు సుందర్ సి దర్శకత్వం ప్రభావవంతంగా లేదు. సుందర్ సి సినిమాలు సాధారణంగా రొటీన్ కథలు ఉన్నప్పటికీ మంచి వినోదాన్ని అందిస్తాయి, కానీ ఇందులో అది కూడా లోపించింది.
దైవ శక్తి గురించి చెప్పాల్సివుంటే చాలా భారీగా తియాల్సిన కథ సినిమా. చాలాచోట్ల లోపాలున్నా, తనదైన శైలిలో దర్శకుడు సినిమా తీశాడు. ఇది ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.
రేటింగ్ : 2.5/5

