Nayanatara: మహాశక్తి సినిమా కోసం ప్రమోషన్ చేస్తూ దైవిక ఆశీస్సులు కోరుతున్న నయనతార
Nayanatra pooja publicity
చెన్నైలోని ప్రసిద్ధ కాళికాంబళ్ ఆలయాన్ని నయనతార సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదంతో సినిమా ప్రమోషన్స్, విడుదల ఏర్పాట్లు జోరందుకున్నాయి.
2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ్ ఫాంటసీ భక్తి థ్రిల్లర్ చిత్రం మూకుత్తి అమ్మన్. ఈ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 పేరిట నవంబర్ 6వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పైగా ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహిస్తుండడం, అటు రెజీనా కసాండ్రా విలన్ పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా దునియా విజయ్ కూడా ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఊర్వశి, యోగి బాబు, అభినయ, రామచంద్రరాజు, స్నేహ , మీనా లాంటి భారీ తారాగణం ఇందులో భాగమవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన దర్శకుడు సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణుల కష్టాన్ని గుర్తించాలని కోరారు. దాదాపు 400 మంది సీజీఐ కళాకారులు ఏడాదిన్నర పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించారని తెలిపారు..
ఈ సినిమాలో మొత్తం 3,000 సీజీఐ షాట్లు ఉన్నాయని, వాటిలో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన విజువల్స్ అన్నింటినీ టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి రూపొందించారని తెలిపారు.

