1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. 3 Omicron Cases detected in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం - కేసుల నమోదు

Omicron Case
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం చెలరేగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ వైరస్ బారిన ఇద్దరు రోగులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 
 
ఈ ఇద్దరు రోగులు సోమాలియా, కెన్యా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన ఓ బాలుడుకి కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం. ఈ బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : పార్టీ ఎంపీలతో ప్రధాని మోడీ అల్పాహార విందు