ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (14:52 IST)

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను ఇంటర్ బోర్డు గతంలో రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది. ఈ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు, ప్రస్తుత విద్యా సంస్థరం ఇంటర్ పరీక్షలను వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాల్సివుంది. అయితే, కరోనా కారణంగా ఈ యేడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహించనున్నారు.