దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. అలాగే కొత్త కరోనా వైరస్‌లను కూడా గుర్తిస్తున్నారు. తాజాగా మరో రెండు రకాలను గుర్తించారు. అదేసమంలో మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళ, రాష్ట్రాల్లో కొత్తగా వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్ర, కేరళలో ఎన్440కె, ఈ484కె రకాలను గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. అంతేకాదు, ఇందులో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని తెలిపింది. అయితే, పైన చెప్పిన రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు...