శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (10:46 IST)

కర్ణాటకలో మళ్లీ పెరిగిన కేసులు.. అపార్ట్ మెంట్ సీజ్.. పది మందికి కరోనా

కర్నాటక రాజధానిలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఓ బిల్డింగ్‌లో పది మందికి పాజిటివ్ వచ్చింది. 15వేల మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పది మంది కోవిడ్ వచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి 22వ తేదీ మధ్య వారంతా పాజిటివ్‌గా తేలినట్లు బీబీఎంపీ కమీషన్ మంజునాథ్ ప్రసాద్ తెలిపారు. దీంతో ఆరు బ్లాక్‌లను కంటేన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. 
 
ఆ రెసిడెన్షియల్ సొసైటీలో రెండు మ్యారేజ్ పార్టీలు జరగిన తర్వాత కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిలో ఎక్కువ శాతం మంది 50 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నట్లు డాక్టర్ కృష్ణప్ప తెలిపారు. మహారాష్ట్ర, కేరళ తర్వాత అత్యధిక కోవిడ్ కేసులు కర్ణాటకలోనే ఉన్నాయి.