శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:24 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 67మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 67 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఒకరు మృతి చెందారు. వైరస్‌ బారినపడి చికిత్సకు కోలుకొని 70 మంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,89,210 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. 8,81,439 మంది చికిత్సకు కోలుకున్నారు.

మరో 604 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,167 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 26,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటివరకు 1,36,97,048 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
 
అలాగే భారత్‌లో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. 10,307 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,77,387 కాగా, 1,06,78,048 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరణాల సంఖ్య 1,56,212కు చేరింది.