బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (14:53 IST)

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అప్పుడే అభివృద్ధి : జగన్

ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6 వ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి పాల్గొన్నారు. 
 
పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తుందని జగన్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై జగన్ ప్రస్తావించారు. విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని పార్లమెంట్ లో చెప్పారని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
 
పోలవరం విషయంలో సవరించిన అంశాలకు ఆమోదం తెలపాలని కోరారు. అలానే రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతులను కోరారు జగన్. ఇక ఇదిలా ఉంటె, కేంద్ర సర్కార్ జీఎస్టీ పరిహారాన్ని రిలీజ్ చేసింది. 
 
17 వ విడత జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 2,222.71 కోట్లు ఉండగా, తెలంగాణకు రూ.1940.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 91,640.34 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రాలకు రిలీజ్ చేసింది.