గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శని దోషాలు తొలగిపోవాలంటే.. పడకగదిలో నీలం రంగు బల్బును..?

శని గ్రహం నవగ్రహాల్లో అతి ముఖ్యమైంది. జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కానీ శనికి పరిహారాలు చేస్తే.. శనిని దూషించకుండా వుంటే చాలా మటుకు ఇబ్బందులను అధిగమించవచ్చు. శనిగ్రహ దోష పరిహారాలతో ఈతిబాధలను తొలగించుకోవచ్చు. 
 
అందుకే శనివారం నీలం రంగు దుస్తులను ధరించాలి. శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతి రోజూ మార్నింగ్ వాక్ చేయాలి. సాధ్యమైనంతవరకు వాహనాలకు వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది. శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వుల నూనె రాసుకుని కొంత సమయం తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. 
 
తడి కాళ్లతో నిద్రించరాదు. పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలి. పూజ, పడక గది పరిశుభ్రంగా వుంచాలి. బెడ్ రూమ్‌లో నీలం రంగు బల్బు వేసుకుంటే సుఖవంతమైన నిద్ర పడుతుంది. అలాగే శని దోషాలు తొలగిపోవాలంటే చక్కెర కానీ, తేనె కానీ చీమలకు వేయడం చేయాలి. ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను ఇవ్వాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.