బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (22:13 IST)

మోకాలి నొప్పికి పెరటివైద్యం

గాయం లేదా ఆర్థరైటిస్ మంట వల్ల కలిగే మోకాలి నొప్పికి విశ్రాంతి తీసుకోవడం, ఐస్ అప్లై చేయడం మంచిది. ఐతే ఐసును నేరుగా చర్మంపై పెట్టకూడదు. వస్త్రంలో చుట్టి పెట్టాలి. మోకాలికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. వాపును తగ్గించడానికి ఐసు ముక్కతో మర్దన చేయాలి.
 
ఆర్థరైటిస్ నొప్పి లేదా మోకాలి నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి వేడి, చల్లని చికిత్సలు సహాయపడతాయి. వేడి చికిత్సలలో ఉదయాన్నే సుదీర్ఘమైన, గోరువెచ్చని స్నానం చేస్తే సమస్య తగ్గుతుంది. అలాగే కీళ్ల నొప్పి, వాపు మరియు మంట నుండి ఉపశమనం పొందేందుకు ఒక టవల్‌లో ఒక జెల్ ఐస్ ప్యాక్ సంచిని చుట్టి, త్వరగా ఉపశమనం కోసం బాధగా వున్న కీళ్ళకు వర్తించాలి. చర్మానికి నేరుగా ఐస్‌ని ఎప్పుడూ వేయకూడదు.
 
ఇంకా ఆయుర్వేద షాపుల్లో కీళ్ల నొప్పులకు లేపనాలు వుంటాయి. వాటిని ఉపయోగించినా మోకాలు నొప్పి లేదా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.