బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 31 అక్టోబరు 2020 (22:20 IST)

గొంతు నొప్పికి చిట్కాలు

ఉన్నట్లుండి కొందరికి గొంతులో మంట పుడుతుంది. మింగుతుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. దీన్ని నివారించేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.
 
గోరువెచ్చని మంచి నీటిలో 1/2 లేదా 1 టీస్పూన్ ఉప్పును కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.
 
తేనెతో వేడి టీ, సూప్ ఉడకబెట్టిన పులుసు లేదా నిమ్మకాయతో వెచ్చని నీరు వంటివి గొంతు మంటను తగ్గించేందుకు సాయపడతాయి.
 
హెర్బల్ టీలు కూడా గొంతు నొప్పి లేదా మంటను తగ్గిస్తాయి.
 
గొంతు బాగా నొప్పి, మంటగా అనిపిస్తుంటే గొంతుకు కాస్త విశ్రాంతినివ్వండి.