మంగళవారం, 14 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (19:36 IST)

కొలెస్ట్రాల్‌ను కరిగించే స్ట్రాబెర్రీ పండ్లు.. అల్సర్ కూడా మాయమట..

Strawberries
స్ట్రాబెర్రీ పండ్లలో పండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. స్ట్రాబెర్రీలో వున్న విటమిన్ సి, యాంటీ-యాక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. స్ట్రాబెర్రీ పండ్లు చర్మానికి వన్నె తెస్తుంది. 
 
పొడిబారిన చర్మానికి చెక్ పెడుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. చర్మానికి తేమనిస్తుంది. పీచు పుష్కలంగా వుండే ఈ పండును తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. వేసవిలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మఛాయను పెంపొందింపజేస్తుంది. 
 
స్ట్రాబెర్రీలోని సాలిసిలిక్ ఆమ్లాలు మొటిమలను తొలగిస్తుంది. స్ట్రాబెర్రీ ముఖ సౌందర్యానికి మెరుగుపరుస్తుంది. ఈ పండ్లును తీసుకుంటే నాజూగ్గా వుండవచ్చు. వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలను నివారిస్తుంది. స్ట్రాబెరీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది. గుండె సమస్యలకు దారితీసే ఆర్థరైటీస్ బారీన పడకుండా కాపాడుతుంది. 
 
స్ట్రాబెర్రీతో అల్సర్‌ని తగ్గించవచ్చట. పొట్టలో ఏర్పడే అల్సర్‌కు స్ట్రాబెర్రీతో చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించే వారికి స్ట్రాబెర్రీ మరింత బాగా పనిచేస్తుందని, శరీరంలోని అల్సర్‌ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.