శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (13:50 IST)

కొబ్బరి పువ్వులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? (Video)

Coconut flower
కొబ్బరి పువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి పువ్వులో కొబ్బరి బొండా కంటే అధిక పోషకాలున్నాయి. కొబ్బరి నీళ్లకంటే కొబ్బరి పువ్వులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే శక్తి అధికంగా వుంటుంది. కొబ్బరి పువ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ అంటువ్యాధులను నిర్మూలిస్తుంది. మానసిక ఒత్తిడి అధికంగా వున్నవారు కొబ్బరి పువ్వును తీసుకుంటే మంచి ఎనర్జీ లభిస్తుంది. 
 
అజీర్ణ సమస్యలు వున్నవారు కొబ్బరి పువ్వును తీసుకోవచ్చు. ఇందులోని మినరల్స్, విటమిన్లు పేగులకు మేలు చేస్తాయి. టెంకాయలోని పువ్వును తీసుకుంటే ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా రక్తంలోని చక్కర శాతం తగ్గుతుంది. ఇంకా మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. గుండెకు మేలు చేస్తుంది. గుండెలో చేరే కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. 
 
థైరాయిడ్ సమస్యను దరిచేరనివ్వదు. శరీర బరువును నియంత్రిస్తుంది. ఇందులోకి లో-కెలోరీలు శరీర బరువును తగ్గిస్తుంది. టెంకాయలోని పువ్వులను తీసుకోవడం ద్వారా యూరినల్ సమస్యలను నియంత్రించుకోవచ్చు. వృద్ధాప్య ఛాయలను కొబ్బరి పువ్వు దూరం చేస్తుంది. యాంటీ-యాక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వుంటాయి. చర్మంపై ముడతలను ఇది తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.