శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (18:00 IST)

కరోనా వైరస్ నుంచి గట్టెక్కాలంటే.. త్రిఫల చూర్ణాన్ని ఇలా వాడాలి.. (Video)

triphala
కరోనా వంటి మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే ఆయుర్వేద సూత్రాలు కూడా పాటించాలి. ఆయుర్వేద ఔషధాల్లో ఒకటైన త్రిఫల చూర్ణాన్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని పెద్దవాళ్లు అరచెంచా, చిన్నపిల్లలు పావుచెంచా చొప్పున తీసుకోవచ్చు. అధిక బరువున్నవాళ్లు చల్లటి నీళ్లతో త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. అరచెంచా చొప్పున రెండు పూటలా వాడాలి. ఇబ్బందులొస్తే పావుచెంచా చొప్పున తీసుకోవాలి. 
 
నేత్ర సంబంధ సమస్యలున్నవాళ్లు పాలతోపాటు తీసుకోవాలి. పాలల్లో తేనె, నెయ్యితో ఈ చూర్ణాన్ని కలిపి తింటే కళ్లు, చర్మం, మెదడుకు మేలు చేస్తుంది. మధుమేహగ్రస్థులు నరాల సమస్యలను, కాలేయ పనితీరును మెరుగుపరచడానికి... ఈ చూర్ణాన్ని చల్లటి నీళ్లతో కలిపి అరచెంచా చొప్పున వాడితే మంచిది. జుట్టు రాలిపోతుంటే కుంకుడు రసంలో అరచెంచా చూర్ణాన్ని కలిపి మాడుకు పట్టించాలి. 
 
త్రిఫలం అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ మూడింటిని పొడిని చేసుకుంటే త్రిఫల చూర్ణం సిద్ధం. ఎందుకే ఎండిన ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కరక్కాయ రోగ నిరోధకశక్తిని పెంచి, అజీర్తి నుంచి కాపాడుతుంది. జుట్టు రాలే సమస్యను తానికాయ అరికడుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు దీన్ని వాడితే తీవ్రత తగ్గడంతోపాటు రోగి త్వరగా కోలుకునే అవకాశముందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.