శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మే 2020 (11:39 IST)

అతిమధురం లైంగిక శక్తికి టానిక్.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? (Video)

Athimadhuram
అతిమధురం గురించి తప్పక తెలుసుకోవాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. టీ పొడుల్లో ప్రస్తుతం ఆయుర్వేద మూలికలు వున్నట్లు ప్రకటనలు వినే వుంటాం. అలాంటి అతిమధురం పొడిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునో చూద్దాం.. అతిమధురం పొడిని ఉదయం, రాత్రిపూట అరస్పూన్ మేర తీసుకుంటే పేగు సంబంధిత రుగ్మతలే కాకుండా ఉదర సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
జీర్ణక్రియ వేగమవుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. అతిమధురం, పిప్పిళితో కలిపి పొడి చేసుకుని.. నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. దగ్గు తగ్గిపోతుంది. గొంతులో గరగర తొలగిపోతుంది. పచ్చ కామెర్లు, ఛాతిలో నొప్పి, తలనొప్పికి అతిమధురం దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చకామెర్లను అతిమధురం పూర్తిగా నియంత్రిస్తుంది. 
 
మహిళల్లో ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలంటే అతిమధురాన్ని ఆహారంలో భాగం చేస్తుంది. దగ్గు, జలుబు, మోకాళ్ల నొప్పులను ఇది నయం చేస్తుంది. వేడి నీటిలోనూ అతిమధురాన్ని చేర్చి తీసుకోవచ్చు. ఈ నీటిని పురుషులు ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే.. ఆస్తమా, జుట్టు నెరవడం, వీర్యలోపం వంటి సమస్యలుండవు. అతిమధురంతో వాత రోగాలు నయం అవుతాయి. కిడ్నీ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అతిమధురం చూర్ణానికి అవసరమైనంత చక్కెర కలిపి, రోజుకు రెండు సార్లు, రెండు స్పూన్ల చొప్పున సేవిస్తుంటే ఎలర్జీ, దద్దుర్లు తగ్గుతాయి. ఆవు నేయిని గోరువెచ్చగా వేడిచేసి అందులో అతి మదురం చూర్ణం కలిపి పట్టీ వేస్తే నొప్పి, వాపు తగ్గిపోయి గాయం తొందరగా మానుతుంది.

ఒక స్పూన్ అతిమధురం చూర్ణానికి రెండు టీ స్పూన్ల తేనె, ఒక టీ స్పూను ఆవునేయి కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. అతి మధురం చూర్ణాన్ని తేనెతో గానీ, పాలతో గానీ సేవిస్తే, వైరల్‌ జ్వరాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.