సంబంధిత వార్తలు
- కరోనా వేళ.. గట్టిగా కూడా మాట్లాడకూడదట.. తుంపరులు..?
- కరోనావైరస్ సమయంలో తట్టు కూడా ప్రబలే ప్రమాదముందా?
- 'కరోనా'కు మరణం లేదు : 'వైరస్'తో కలిసి జీవించడం నేర్చుకోండి.. డబ్ల్యూహెచ్ఓ
- భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 3,722 కేసులు
- క్వారంటైన్‌కు 26 మంది లారీ డ్రైవర్లు - మంచిర్యాలలో ఆరు పాజిటివ్ కేసులు
కరోనా నుంచి గట్టెక్కాలంటే.. ఇవి తినాల్సిందే..?
కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇందులో భాగంగా ఆహారంలో తాజాపండ్లు, కూరగాయలను తప్పక తీసుకోవాలి. రంగు రంగుల కూరగాయలు, పండ్లలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ, క్యారెట్, ఆకుకూరలు తీసుకోవాలి. ఇంకా ఒమేగా-3 సమృద్ధిగా వుండే చేపలను తీసుకోవాలి.
విటమిన్ బి కలిగిన పుడ్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పాల ఉత్పత్తులు, పిల్లలకు విటమిన్ డి ఎక్కువగా ఆహారం ఇవ్వడం చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్ల ఫుడ్‌కు దూరంగా వుండాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను పిల్లలకు అలవాటు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకసారిగానీ, రెండుసార్లుగానీ తాగడం చేయాలి. అవసరమనుకుంటే బెల్లం లేదా తాజా నిమ్మరసాన్నికలుపుకోవచ్చు. పసుపు కలిపిన పాలను సేవించాలి.
పొడి దగ్గు వుంటే పుదీనా ఆకుల రసాన్నీ లేదా నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి. లవంగాల పొడిని బెల్లంలోగానీ లేదా తేనెలో గానీ కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగరనుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు ఎక్కువగా వుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. దాహం వేస్తే గోరువెచ్చని వేడినీరును సేవించాలి. రోజూ తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కరోనాను తరిమికొట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
