శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మే 2020 (09:15 IST)

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పరీక్షలు.. ఫలితం నెగటివ్

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని కొత్త ఔషధాల వాడకంతో రియాక్షన్‌ వచ్చి జ్వరం రావడంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌ను ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి విదితమే. 
 
సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ముందస్తు జాగ్రత్తగా మన్మోహన్ సింగ్‌కు కరోనా నిర్ధారణ పరీక్ష కూడా నిర్వహించామని, ఫలితం నెగెటివ్‌ అని వచ్చిందని పేర్కొన్నాయి.
 
నిజానికి.. ఆయనకు కరోనా పరీక్షలు చేస్తున్నప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరీక్షల్లో ఏం తేలుతుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ.. ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడడంతో ఆయనను ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.