శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఆర్. సందీప్
Last Updated : గురువారం, 14 మే 2020 (15:26 IST)

తమలపాకులను తేనెతో కలిపి తీసుకుంటే? (video)

హిందూ సాంప్రదాయంలో తమలపాకులది ప్రత్యేక స్థానం. పూజ, పెళ్లిళ్లకు మరియు ఇతర శుభకార్యాలకు దీనిని విరివిగా వాడుతుంటారు, అన్నం తిన్న తర్వాత దీనిని నమలడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనం కూడా చాలా ఎక్కువే. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు మందులపై ఆధారపడకుండా దీనిని హాయిగా ఉపయోగించవచ్చు. తలనొప్పి, అజీర్తి నుండి మనం సాధారణంగా ఎదుర్కొనే అనేక రుగ్మతలను తమలపాకులతో తగ్గించుకోవచ్చు.
 
చిన్న గాయాలు, వాపు, నొప్పి ఉన్న చోట తమలపాకును ఉంచితే ఉపశమనం లభిస్తుంది. దానిని నమిలి రసం మ్రింగినా అదే ఫలితం కనిపిస్తుంది. అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ మూలాన ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకం నివారణ అవుతుంది. 
 
అరుగుదలకు సహకరించే ఆసిడ్స్ జీర్ణకోశంలో దీని వల్ల ఉత్పత్తి అవుతాయి. ఆహారం తినాలనిపించకపోతే రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ని తమలపాకులు బయటికి పంపిస్తాయి. రక్తప్రసరణకు సహకరించడమే కాకుండా తమలపాకులు మెటబాలిజంని కూడా వృద్ధి చేస్తాయి.
 
దగ్గు నివారణకు మందుగా పనిచేస్తుంది, దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. దీని రసాన్ని కొబ్బరినూనెలో కలిపి గాయాలు, వాపులు, మంట ఉన్న చోట రాస్తే తగ్గిపోతాయి. 
 
ఎగ్జిమా, స్కాబీస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. తమలపాకులు మెంటల్ అలర్ట్‌నెస్‌ని పెంచుతాయి. వీటిని తేనేతో కలిపి తీసుకుంటే టానిక్‌లా పనిచేస్తుంది. వీటి రసం మొటిమలను తగిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ని తగ్గింది మధుమేహానికి మందులా పనిచేస్తుంది.