బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 11 మే 2020 (22:47 IST)

బాగా చదివే పిల్లలకు పైత్యం ఏర్పడుతుంది, అలాంటి వారికి పటికబెల్లాన్ని...

వేసవి రాగానే విపరీతమైన ఉష్ణోగ్రతలను చవిచూడాల్సి వస్తుంది. ఐతే ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొన్ని పదార్థాలను తీసుకోవాలి. వాటిలో కొబ్బరినీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ రసం, రాగిజావ, సగ్గుబియ్యం జావ. మనం ఇప్పుడు మజ్జిగ గురించి తెలుసుకుందాం.
 
1. పిల్లలు ఎక్కువ సమయం చదవటం వలన వారికి పైత్యం ఏర్పడుతుంది. దీనిని తగ్గించడానికి మజ్జిగలో పటికబెల్లం కలిపి ఇవ్వాలి.
 
2. నిద్ర సరిగా పట్టనివారు మజ్జిగలో పెద్దఉల్లిపాయను పేస్టులా చేసి కలిపి నిద్రపోయే గంటముందు తీసుకోవాలి.
 
3. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
 
4. మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పిల్లలకు నీరసం రాకుండా ఉంటుంది.
 
5. రక్తం తక్కువగా ఉన్న పిల్లలకు పండ్ల రసాలతో పాటు, కరివేపాకు కలిపిన మజ్జిగను ఇవ్వడం వలన రక్త వృద్ధి చెందుతుంది.
 
6. మజ్జిగను పలచగా వెన్న తీసి ఎక్కువసార్లు ఇవ్వాలి.
 
7. ఎండ వలన చర్మం పొడిబారిపోతే మజ్జిగలో నిమ్మరసం కలిపి రాసుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.