శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 6 మే 2020 (19:19 IST)

తులసి ఆకులను దంచి యాలకుల పొడి కలిపి... (Video)

రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన ఔషధ మొక్క మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తులసి ఆకుల రసం, తులసి టీ సర్వరోగ నివారణిలు, ఏదో ఒక రూపంలో తులసిని తరచూ తీసుకోవాలట. అలా చేస్తే ఎంతో ఉపయోగకరమంటున్నారు. ముఖ్యంగా యోగవాహి లాంటిది ఆయుర్వేదం అంటున్నారు వైద్య నిపుణులు.
 
నీడలో ఎండబెట్టిన తులసి ఆకులు, వరెమ్మలు శుభ్రం చేసి వేళ్ళతో సహా తులసి పంచాగాలన్నీ ఒకే గుణం కలిగి ఉంటాయి. ఎండిన తులసిని దంచి అందులోకి యాలకుల పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకుల పొడి తగుపాళ్ళలో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిన గ్లాసు నీళ్ళలోకి వేసి మరగకాచి అందులో నిమ్మరసం కలుపుకుని రోజుకు మూడు పూటలా టీలాగా సేవించాలట.
 
కొన్ని రకాల తులసి మొక్కల్లో యూజెనాల్, సిట్రాల్, కర్పూరం, థైమాల్ లాంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మజీవి నాశకం అంటారట. రేడియేషన్ చికిత్సలో ఆరోగ్య కణాలు దెబ్బతినకుండా తులసి కాపాడుతుందట. లవంగం వేసి వండే వంటకాల్లో తులసి ఆకుల్ని కూడా వేసి వండుకోవచ్చట. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.