గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (19:47 IST)

తులసీ మొక్క అంత పవిత్రమైందా..?

తులసీ దళం పవిత్రమైంది. దైవ మూలికగా పేరున్న తులసీ మొక్కను ఇంట నాటడం సకల శుభాలను ఇస్తుంది. తులసీ మొక్క అడుగు భాగంలో శివ పరమాత్మ, మధ్యలో శ్రీ మహావిష్ణువు, తులసీ ఆకుల చివర్లలో బ్రహ్మదేవుడు కొలువై వుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా ముమ్మూర్తులను కలిగివున్న తులసీ చెట్టును ఇంట నాటడం.. రోజూ పూజ చేయడం ద్వారా.. సకల అభీష్టాలు చేకూరుతాయి. 
 
త్రిమూర్తులతో పాటు తులసీ మొక్కలో 12మంది ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవశులు, అశ్వినీ దేవులు కొలువై వుంటారు. అలాంటి తులసీ మొక్కను పూజించే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. రోజూ తులసీ కోట ముందు రంగవల్లికలతో.. దీపమెలిగించి.. శుభ్రమైన నీటిని ఆ చెట్టు వేర్లపై పోస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే తులసీ వేర్లలో కుంకుమ, చందనం, పుష్పాలతో అలంకరణ చేసి.. ధూపదీపారాధనతో నైవేద్యం చేస్తి కర్పూర హారతులు ఇవ్వడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 
Lights
 
శ్రీకృష్ణుని మహా ప్రీతికరమైన తులసీని పవిత్రంగా భావించి పూజించడం.. తులసీ మొక్కను పెంచడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. పుణ్య ఫలం సిద్ధిస్తుంది. తులసీ పూజతో, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుని అనుగ్రహం పొంది.. ముక్తిని సంపాదించుకోవచ్చు. ఇంకా మరుజన్మంటూ వుండదు. తులసీ ఆకులను నెత్తిన వుంచినప్పుడు ప్రాణాలు విడిస్తే.. అనేక పాపాలు తొలగిపోయి వైకుంఠవాసం సిద్ధిస్తుందని పండితుల వాక్కు.