1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. Pray lord shiva with mahamrutyanjaya mantra

కరోనా వేళ పరమేశ్వరుడిని ఈ మంత్రంతో పూజిస్తే...

Pray
సృష్టి లయకారకుడు పరమేశ్వరుడు. అందుకే శివుడాగ్న లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. ఈ సృష్టిలో ప్రతి జీవికి జరిగే పరిమాణాలన్నీ ఆ పరమేశ్వరుడి చేతనే లయం చేయబడుతుంటాయి. అందుకే అవన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే ఐక్యమవుతాయి. అందుకే లయకారకుడయిన శివుని మృత్యుంజయ మంత్రంతో జపిస్తే ఎలాంటి భయాలు దరిచేరవు. అంతేకాదు... మరణ భయం కూడా తొలగుతుంది.
 
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌" 
 
భావం: 'అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి'.
 
మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ పెద్దల మాట. 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
నీవు అనుభవించవలసిన ఫలితం నీకోసం కాచుకుని వుంది