శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (16:49 IST)

కరోనా లాక్ డౌన్- ఇంట్లో వుంటే.. ఇలా చేయండి..

కరోనా కారణంగా ఇంట్లో వున్న వారు.. రోజూ యాపిల్‌ను తప్పకుండా తీసుకోవడం చేయాలి. పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగాలి. నీరు 3 నుంచి నాలుగు లీటర్లు తాగాలి. ప్రతిరోజూ రెండేసి తులసీ ఆకులు, రెండేసి వేపాకులు నమిలితే మంచి ఫలితం వుంటుంది. అలాగే ఆరెంజ్‌, నిమ్మతో పాటు కివీ పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. 
 
రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వం పెరగడం, గాయాలు తొందరగా నయం కావడంలో విటమిన్‌ సి తోడ్పడుతుంది. కివీ తింటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ పండులోని ఐరన్‌ దంతాలు దృఢంగా, కంటి చూపు చురుగ్గా ఉండడంలో సాయపడుతుంది. 
 
దీనిలో సహజంగా ఉండే యాక్టినిడిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గర్భిణులు కివీ తింటే సరిపడా ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఫోలిక్‌ ఆమ్లం ఎంతో అవసరం. ఆకుకూరలు, తాజా కూరగాయలు, నిమ్మజాతి పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, మామిడిపండు, క్యాబేజీ, కివీ నుంచి విటమిన్‌ సి లభ్యమవుతుందని వైద్యులు చెప్తున్నారు.