శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (16:36 IST)

కరోనా ముప్పు.. ఉప్పును కాస్త తగ్గిస్తే..?

ఉప్పును కాస్త తగ్గిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తద్వారా కరోనా వైరస్‌కు ఆమడదూరంలో వుండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పును అధికంగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంటుంది. తాజా పరిశోధనల్లో మోతాదు మించిన ఉప్పుతో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిలుతుందని వెల్లడైంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్‌తో ఇంట్లో వున్న ప్రజలు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇంకా ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములకు మించకుండా ఉప్పును వాడాలని సూచిస్తోంది. 
 
ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్‌ వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో రోగనిరోధక కణానికి చెందిన అత్యంత సాధారణ రకం గ్రాన్యులోసైట్స్‌ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉప్పును జాగ్రత్త వాడటం ఆరోగ్యకరం.