శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2020 (22:49 IST)

వేసవి స్పెషల్ ఫ్రూట్, ఈత పండు తింటే ఏం జరుగుతుంది?

సీజన్లను అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లను ఇస్తూంటుంది. వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుంటుంది. వేసవి రాగానే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి కాయలు, సపోటా ఇలా అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. ఈ ఈత కాయలు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. 
 
ఉపయోగాలు
1. ఈత చెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
2. ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
3. ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
4. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.
5. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి.
6. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి.
7. కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. 
8. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది. కనుక ఈతపండ్లను తిని ఆరోగ్యంగా వుందాం.