మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (18:49 IST)

అవిసె ఆకులతో సూప్ తాగితే..? పువ్వుల్లోనూ ఔషధ గుణాలు.. (video)

Avisa Leaves
అవిసె ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అవిసె ఆకుల్లో రెండు రకాలున్నాయి. అవి తెలుపు రంగు పువ్వులతో కూడినవి ఒకరకం. ఎరుపు రంగు పువ్వులతో కూడిన అవిసె ఆకులు రెండో రకం. ఈ అవిసె చెట్టు ఆకులు, పువ్వులు, చెక్కలు, వేర్లు ఆయుర్వేద గుణాలతో కూడుకున్నవి. అవిసె ఆకును వండుకుని తినడం ద్వారా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.
 
పిత్త సంబంధిత రోగాలు తొలగిపోతాయి. శరీరంలో వేడి తగ్గుతుంది. కంటికి మేలు జరుగుతుంది. శుభ్రపరిచిన అవిసె ఆకులతో చిన్నపాటి ఉల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర చేర్చి సూప్‌లా తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు. 
 
అవిసె ఆకుల రసాన్ని చర్మంపై దద్దుర్లపై రాస్తే.. ఉపశమనం లభిస్తుంది. చర్మ సమస్యలున్న ప్రాంతంలో అవిసె ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో వేయించి.. పేస్టులా తయారు చేసుకుని రాస్తే మంచి ఫలితం వుంటుంది. అవిసె ఆకులతో పాటు పువ్వుల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అవిసె పువ్వులను వేపులా చేసుకుని తీసుకోవచ్చు. ఇవి కంటి అలసటను దూరం చేస్తాయి. 
 
కిడ్నీ సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. ధూమపానం అలవాటున్న వారు అవిసె పువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటే.. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అయితే అవిసె ఆకులను ఆహారంలో చేర్చుకునేటప్పుడు మాత్రం మందులు వాడకూడదు. అవిసె ఆకులను అదేపనిగా తీసుకోవడం కూడదు. మాసానికి ఓసారి లేదా రెండు నెలలకు మూడుసార్లు మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.