బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (16:10 IST)

వేసవిలో అలసటను తీర్చే ఒకే ఒక్క పండు (Video)

వేసవి ఎండలతో పాటు చల్లదనాన్ని తీసుకువచ్చే తియ్యటి పండు సపోటా. పలుచని చర్మం కింద తేనె రంగులో ఉండే రుచులూరించే తియ్యటి గుజ్జుతో తినడానికి మధురంగా ఉంటుంది సపోటా. దీంతో ఐస్‌క్రీములు, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ తయారుచేస్తుంటారు.
 
శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ పండులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలసటను తగ్గించడంలో రక్తవృద్థిలో సహకరిస్తుంది. మూడు పండ్లు తీసుకుని వాటిపై చర్మం తీసేసి మూడు గ్లాసుల పాలు, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ వెనీలా కలిపి తయారుచేసిన మిల్క్ షేక్ వేసవి కాలంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యనిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 
రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లు తింటే పిల్లలకు, పెద్దలకు ఎన్నో పోషకాలు అందుతాయంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారిలోను, టెన్షన్ వర్క్స్ చేసేవారు సపోటాను తింటే అలసట వెంటనే తగ్గుతుందని.. కొత్త ఉత్సాహం కూడా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.