1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. summer tips, health benefits with sandalwood powder

చమటకాయలతో సమస్య, చందనం లేపనంగా రాసుకుంటే?

summer tips
వేసవి రాగానే చాలామందిని చమటకాయలు వేధిస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఏవేవో పౌడర్లు వాడుతుంటారు కానీ చందనాన్ని అరగదీసి చర్మానికి లేపనంగా వేస్తుంటే చమటకాయల బెడదను వదిలించుకోవచ్చు.
 
చందనంలో ఎర్రచందనం, తెల్లచందనం అని రెండు రూపాల్లో ఉంటుంది. ఎర్రచందనం అనే దానిని పరికరాలు, బొమ్మల తయారీకి వాడుతుంటారు. దీని నుంచి నూనెను సేకరిస్తారు. తెల్లచందనంతో సుగంధ ద్రవ్యాలు, ఔషధాల తయారికీ సెంట్ల తయారీకీ, సబ్బుల తయారీకీ వాడుతుంటారు. ఎర్రచందనం నూనెను చందనాన్ని ఔషధాల తయారీకి వాడుతుంటారు. ఆయుర్వేద మందుల్లోనూ ఇస్తుంటారు. మనం వాడే విధానాన్ని బట్టి తైలాలు పనిచేస్తుంటాయి. దీనిని శ్రీగంధం అని కూడా అంటారు.
 
గంధాన్ని నలుగులా చేసి రుద్దుకుంటే చర్మం మృదువుగా దుర్గంధ రహితంగా ఉంటుంది. గంధం నుంచి తీసిన నూనెను, నీళ్లలో 5-6 చుక్కలు వేసి స్నానం చేస్తే శరీర బడలిక తగ్గుతుంది. ఈ తైలాన్ని నూనెలో కలిపి వత్తిగా చేసి దీపం పెట్టినా, దీనితో చేసిన అగరు వత్తి వెలిగించినా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గంధం అరగదీసి అర చెంచాడు పేస్ట్‌ను నీళ్లలో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, శరీరంలో ఆవిర్లు, మంటలు, పిత్త వికారాలు తగ్గుతాయి. గంధపు నూనెను ఇతర తైలాలతో కలిపి వాడుకోవాలి.
తర్వాతి కథనం
ఆకట్టుకునే కాళ్ళ పట్టీల కోసం ఏం చేయాలి? ఏ సమయంలో వాడాలి?