బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 15 మే 2020 (22:42 IST)

వేసవిలో నీరసం తగ్గి చురుగ్గా ఉండాలంటే?

లాక్‌డౌన్ అయినా కొంతమంది పనుల నిమిత్తం బయటకు వెళుతుంటారు. అలాంటి సమయంలో ఎండ వేడిమితో త్వరగా నీరసించిపోతుంటారు. అయితే అలాంటి వారికి నీరసం తగ్గడానికి, వారు చురుగ్గా ఉండడానికి ద్రాక్ష ఎంతో ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
తీపి, పులుపు రుచులు కలిగిన ద్రాక్షపళ్ళు జీర్ణక్రియకు సహకరిస్తాయి. కాల్షియమ్, ఫాస్పరస్, ఇనుము లవణాలు ఎక్కువగా లభించే ద్రాక్షలు మంచి ఆరోగ్యకరం. బి1, బి2, సి విటమిన్లు ఇందులో అధికంగా లభిస్తాయట. ద్రాక్షపళ్ళు అధికంగా లభించే ఈ కాలంలో జ్యూస్ తయారుచేసుకొని నిల్వ చేసుకోవడం మంచిదట.
 
ద్రాక్ష పళ్ళను కడిగి కొంచెం నీరుపోసి కుక్కరులో రెండుమూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలట. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసుతో కొలిచి ఒక గ్లాసుడు ద్రాక్షరసానికి ఒకటిన్నర గ్లాసుల పంచదార తీసుకోవాలి. పంచదార తీగ పాకం పట్టాలి.
 
ద్రాక్ష ఉడగ్గా కుక్కరులో నీళ్ళ మిగిలితే వాటిని పంచదార పాకం పట్టడానికి ఉపయోగిస్తే విటమిన్లు వృధాగా పోదు. పంచదార పాకం బాగా చల్లారాక దాంట్లో ద్రాక్ష మిశ్రమాన్ని కొంచెం ఫ్రిజర్వేటివ్, ఫ్లేవర్ కోసం కలర్‌కు గ్రేప్ ఎసెన్స్ మూడు చెంచాలు కలపాలి. తరువాత జ్యూస్‌ను వడకట్టి సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 
 
ఎండవేళ తాగడానికి చల్లని పానీయం రెడీగా ఉంటుంది. ద్రాక్షరసం తాగేముందు కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చట. ఇలా తయారుచేసిన వాటిని తాగడం వల్ల నీరసం బాగా తగ్గి ఎనర్జీ వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.