బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (16:27 IST)

వర్క్ ఫ్రమ్ హోం : ఉద్యోగుల మానసికస్థితిపై ప్రభావం : సత్య నాదెళ్ల

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పిస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించింది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు నడువనున్నాయి. 
 
దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ స్పందించారు. ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మంచిది కాదన్నారు. ఇది ఉద్యోగుల మానసిక స్థితిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
వీడియో కాల్స్ ఎప్పటికీ వ్యక్తిగత సమావేశాలను భర్తీ చేయలేవన్నారు. ఒక వ్యక్తి పక్కనే ఉంటే... ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడతారని... దీని కోసం కంపెనీలు కూడా నిబంధనలను మార్చుకోవాల్సి వస్తుందన్నారు.