మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Modified: సోమవారం, 18 మే 2020 (17:15 IST)

మరోసారి జియో సంచలనం, రూ.4కే 1 జీబీ డేటా

భారత టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన జియో మరోసారి అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటాను అధికంగా ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో, ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ధరను రూ.999గా నిర్ణయించింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు రోజుకు 3 జీబీ చొప్పున 84 రోజులపాటు చెల్లుబాటయ్యే డేటా ప్లాన్‍‌ను అందించనుంది. అలాగే డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో నుంచి జియో నంబర్‌లకు, జియో నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్‍‌లకు ఉచితంగా అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌ను చేసుకునే అవకాశం కల్పించింది. 
 
గతవారంలో ప్రకటించిన రూ.999 'వర్క్‌ ఫ్రం హోం' ప్లాన్‌లో రోజుకు 3 జీబీ చొప్పున 84 రోజుల పాటు డేటా వినియోగించుకునే సౌకర్యం కల్పించింది, దీంతో జియో కస్టమర్ మొత్తం 252 జీబీ డేటాను వాడుకోవచ్చు. అనగా ఈ లెక్కన 1 జీబీ డేటాకు కేవలం రూ.3.96 మాత్రమే పడుతుంది. కొత్త త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.599 మరియు రూ.555 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కస్టమర్‌లకు 2 జీబీ మరియు 1.5 జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను జియో అందిస్తోంది.