గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (14:46 IST)

రామ్‌లీలా మైదానంలో వేలాది మంది కార్మికులు.. కరోనా సంగతేంటో?

రామ్‌లీలా మైదానం జనసంద్రంగా మారింది. పాసుల కోసం వేలాది మంది ఈ మైదానానికి చేరుకున్నారు. దీంతో కరోనా ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. కాగా యూపీలోని పలు ప్రాంతాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు మంగళవారం నుంచి బయలుదేరనున్నాయి.

ఆ శ్రామిక రైళ్లలో వెళ్లాలంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కావటంతో దాన్ని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. దీంతో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వేలాదిమంది వలస కార్మికులు రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు.
 
రాష్ట్రంలో వలస కార్మికులు ఎట్టి పరిస్తితుల్లో కాలినడకన గానీ, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై వెళ్లడానికి అనుమంతించవద్దని ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ అధికారుల్ని ఆదేశించారు. ఇక్కడ వలస కార్మికులు అధికం కావడంతో వారి తరలింపు కోసం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను అధికసంఖ్యలో నడపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 
 
రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయటం..ఆ రైళ్లలో ప్రయాణించి సొంత ప్రాంతాలకు చేరుకోవటానికి వేలాదిమంది వలస కార్మికులు ఇలా వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవటాని రామ్ లీలా మైదానికి చేరుకున్నారు. సొంత ఊర్లకు వెళ్లాలనే తపనతో..భౌతిక దూరం పాటించాలనే నిబంధన పాటించటంలేదు. ఇటువంటి పరిస్థితులు కరోనా వైరస్ మరింతగా వ్యాపించటానికి కారణం కావచ్చునని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.