శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (16:07 IST)

పదవ తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త.. ఇంటి వద్దే పరీక్షా కేంద్రాలు

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించబోతుంది. విద్యార్థుల ఇళ్ల సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 
 
లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన తరుణంలో విద్యార్థుల నివాసానికి దగ్గర్లోనే పరీక్షా కేంద్రాలను కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.  ఏపీలో జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది.  
 
ఈ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో హాస్టల్స్‌లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులు లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లారు. చదివిన పాఠశాల ప్రకారం ఎగ్జామ్ సెంటర్స్‌ను కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి వారం పాటు ఉండాల్సి ఉంటుంది. ఆ శ్రమ వారికి లేకుండా.. విద్యార్థుల నివాసం దగ్గరే పరీక్షా కేంద్రాలుంటే ప్రయాణం చేసే సమయం తగ్గుతుందని ఏపీ సర్కారు నిర్ణయించింది.