ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (12:28 IST)

ఏపీలో 52, తెలంగాణలో 42.. కరోనా కేసులు తగ్గవా?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 2282 చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 52 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయిందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 12, నెల్లూరులో 7, తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చినవారు 19 మంది ఉన్నారు.
 
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఆదివారం మరింతగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 42 కరోనా కొత్త కేసులను అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1551కు చేరింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకొని ఆదివారం 21 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 525గా ఉంది.