శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (16:38 IST)

స్కూల్స్ తెరిచాక విధించే కొత్త రూల్స్ ఏంటో తెలుసా?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి మూడో వారం నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసివున్నారు. కరోనా వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్రం కూడా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ కారణంగానే పాఠశాలలు, కళాశాలలు మూసివేసివున్నారు. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులను ప్రమోషన్ చేస్తున్నారు. దీంతో దేశంలో విద్యా రంగం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 
 
ఈ పరిస్థితుల్లో పలు దేశాల్లో పాఠశాలలు ప్రారంభించారు. అయితే, తమ పిల్లలను మాత్రం ఆరోగ్యం దృష్ట్యా తల్లిదండ్రులు స్కూల్స్‌కు పంపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం ఓ సవాల్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లో త్వరలో కూడా కొత్త విద్యా సంవత్సరం జూన్ నెలలో ప్రారంభంకావాల్సివుంది. అయితే, పాఠశాలలు తెరవడం ఓ ఛాలెంజింగ్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరిస్తే సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. విద్యార్థులకు షిప్టు విధానంలో తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే, మరికొంతమందికి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే అంశాలను పరిశీలిస్తున్నారు.