శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (13:34 IST)

మంగళవారం అష్టలక్ష్మీ పూజ చేస్తే..? (video)

Deepam
మంగళవారం పూట అష్టలక్ష్మీ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఎనిమిది పేర్లతో పిలవబడుతోంది. సంపద, జ్ఞానం, అన్నం, మనోధైర్యం, కీర్తి, వీరం, సంతానాన్ని ప్రసాదించే శక్తి అష్టలక్ష్మికి వుంది. అష్టలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే.. ఆ ఇంట సిరిసంపదలకు కొదువ వుండదు. అందుకే అష్టలక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. ముఖ్యంగా మహిళలు ఇంట మహాలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
రోజూ ఉదయం, సాయంత్రం పూట రెండు పూటలూ.. ఇంటిని శుభ్రం చేసుకుని నేతితో దీపం వెలిగించి అష్టలక్ష్మిని పూజించడం ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా అష్టలక్ష్మిని పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయంటే..?
 
1. ఆదిలక్ష్మి: వ్యాధులు దరిచేరవు. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
2. ధాన్యలక్ష్మి: ఆహార ధాన్యాలు ధారాళంగా లభిస్తాయి. ఇంట ఆకలి బాధలుండవు. 
 
3. ధైర్య లక్ష్మి : జీవితంలో ఏర్పడే ఈతిబాధలను ఎదుర్కొనే శక్తి ఈమెను పూజించడం ద్వారా లభిస్తుంది. 
4. గజలక్ష్మి : జీవితంలో అన్నీ శుభఫలితాలు లభిస్తాయి. 
 
5. సంతాన లక్ష్మి : సంతానం కోసం ఈమెను పూజించడం చేయాలి. 
6. విజయలక్ష్మి -శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తికావాలంటే ఈమెను పూజించాలి. 
 
7. విద్యాలక్ష్మి - విద్య, తెలివి, జ్ఞానం పొందేందుకు ఈమెను పూజించాలి. 
8. ధనలక్ష్మి- సిరిసంపదలు పొందాలంటే ఈమెను నిష్టతో పూజించాలని ఆధ్యాత్మిక  పండితులు అంటున్నారు.