వాస్తు దోషాలను తొలగించే గోరింటాకు మొక్క?!
గోరింటాకు మొక్క వాస్తు దోషాలను తొలగిస్తుందట. గోరింటాకు మొక్క ఇంట్లో వుంటే.. శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గోరింటాకు మొక్క శ్రీ మహాలక్ష్మీదేవి అంశమని పండితులు అంటున్నారు. ఏ ఇంట గోరింటాకు మొక్క వుంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు వుండవు. కారణం గోరింటాకు మొక్కకు వున్న వాసన.
ఈ వాసన కొన్ని రకాల పురుగులను చంపేస్తుంది. గోరింటాకు మొక్కను ఇంట్లో వుంచడం ద్వారా క్షుద్ర శక్తులు కూడా నశిస్తాయని పండితుల వాక్కు. గోరింటాకు మొక్కను ఇంట్లో నాటి శుక్రవారం పూట సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా.. ఆ వాసనకు కంటికి తెలియని క్రిములు తొలగిపోతాయి. దుష్ట శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా గోరింటాకు గింజలతో సాంబ్రాణి ధూపం వేస్తే.. ఆ ఇంట మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
ముఖ్యంగా వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుంది. వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళల్లో వుండేవారు ఇంటి ముందు తులసి మొక్క, గోరింటాకు మొక్కను నాటడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి.
ఇంకా వాస్తు దోషాలను తొలగించుకునేందుకు గోరింటాకు మొక్కను తప్పకుండా నాటాలని.. అలా కుదరకపోతే.. పూల తొట్టెలోనైనా గోరింటాకు మొక్కను పెంచడం మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.