శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By రామన్

11-04-2020 శనివారం మీ రాశిఫలాలు - పద్మనాభస్వామిని ఆరాధించినా...

మేషం : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాలయందు ఉన్నవారికి ఆదాయం బాగుంటుంది. కళాకారులకు అనుకూలం. విద్యార్థులకు విజయం. కోర్టు వివావాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు ప్రాప్తి. బంధు మిత్రుల కలయిక. దూర ప్రయాణాలు చేస్తారు. 
 
వృషభం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్థులకు అనుకూలం. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మిత్రులను కలుసుకుంటారు. పూర్వజన్మ స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. 
 
మిథునం : ఆడిటర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులకు ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. ప్రముఖులను కలుసుకుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. స్త్రీల ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. హామీలు ఉండుట మంచిదికాదు అని గమనించండి. 
 
కర్కాటకం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. గృహంలో సందడి కానవస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మెళకువ అవసరం. తలచిన కార్యములు నెరవేరుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. 
 
సింహం : మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందిపడుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తువచ్చు. రుణ ప్రయత్నాలు వాయిదాపడతాయి. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలను తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. లాయర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ తొందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో ఆవేదన కలిగిస్తాయి. సోదరీ, సోదరులతో మెళకువ వహించండి. 
 
తుల : దూర ప్రాంతాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకో సంతృప్తి కానవస్తుంది. పాత వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. క్రయ, విక్రయ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కతుంది. తలపెట్టిన పనులలో సఫలీకృతులవుతారు. 
 
వృశ్చికం : హోటల్, తినుబండరాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సదావకశాలు జారవిడుచుకుంటారు. సంతాన విషయంలో సంతృప్తికానరాదు. ఉద్యోగస్తుల మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఏకాగ్రత వహించండి. 
 
ధనస్సు : బంధు మిత్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలం. రాజకీయాలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. వాహనాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. 
 
మకరం : చిన్నచిన్న విషయాలకు ఆందోళనపడతారు. కోర్టు వ్యవహారాలు వాయిదావేయడం మంచిది. ప్రైవేటు సంస్థలలో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యం భంగం. 
 
కుంభం : కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అని చెప్పొచ్చు. వైద్యులకు మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు సదావకశాలు లభించినా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పాత పాకీలు వసూలవుతాయి. ధననష్టం కలిగే అవకాశం ఉంది. 
 
మీనం : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గన్న ఏకాగ్రత వహించలేరు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు. స్త్రీలకు కలిసివచ్చే కాలం. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సంఘంలో మీ స్థాయి పెరుగును. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు.