శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

09-04-2020 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తే...

మేషం : వ్యాపారులకు రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. ధనవ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. బంధు మిత్రులతో ఓర్పు, సంయమనంతో మెలగండి. పొదువు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మిథునం : కుటుంబీకుల కోసం ధన విరివిగా వ్యయం చేస్తారు. ఆశించిన రీతిగా ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేస్తారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ కదలికలపై కొంతమంది కన్నేసిన విషయం గమనించండి. 
 
కర్కాటకం : రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
సింహం : మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిదికాదు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరియాలు పెంచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. 
 
కన్య : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఒకానొక విషయంలో బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
తుల : స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు అధికం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందులెదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. 
 
వృశ్చికం : ఊహించని సంఘటనలు సైతం ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉండండి. ఏది ఎలా జరిగితే అలాగే జరుగనివ్వండి. దేనికీ తొందరపడొద్దు. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైనకాలం. 
 
ధనస్సు : రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. విద్యార్థులు బజారు తినుబండరాలు భూజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతోకాక మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకుసాగండి. 
 
మకరం : కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
కుంభం : మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. బ్యాంకింగ్ వ్యవహారంలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సన్నిహితులతో సలహాతో కొన్ని పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
మీనం : మీ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మెళకువలు అవసరం. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యుల కలయికను గోప్యంగా ఉంచడం మంచిది. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్దపెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. స్త్రీలకు, ఇరుగు పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు.