మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

04-04-2020 శనివారం రాశిఫలాలు - నారాయణుడిని తులసి దళాలతో పూజిస్తే...

మేషం : కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెళకువ అవసరం. బంధువుల రాకపోకల వల్ల గృహంలో సందడికానవస్తుంది. దైవకార్యక్రమాల కోసం ధనంబాగా వెచ్చిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. మీ ఆశయాలకు, అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. 
 
వృషభం : ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు, టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
మిథునం : ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైనకాలం. దైవ, సేవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
కర్కాటకం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. జాగ్రత్త వహించండి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని చూరగొంటారు. దూరప్రాంతం నుంచి అందుకున్న ఒక వార్త నిరుద్యోగులకు ఎంతగానో ఉపకరిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
సింహం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. 
 
కన్య : పత్రికా, వార్తా సంస్థలలోని వారికి తోటివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. సోదరీ, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
తుల : నూతన దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు నాణ్యత, ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలు చుట్టుముడుతాయి. రావలిసిన ధనం వాయిదాపడుతాయి. 
 
వృశ్చికం : ప్రియతములు, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. 
 
ధనస్సు : స్త్రీల మాటలకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. 
 
మకరం : రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కొనుట వల్ల ఆందోళన చెందుతారు. గృహ నిర్మాణాలలో మరమ్మతులు చేపడుతారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం తగదు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
కుంభం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేస్తారు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బ్యాకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. 
 
మీనం : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. కొన్ని వ్యవహారాలు ధనవ్యయంతో సానుకూలమవుతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రణబాధలు కొంతతీరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.